'ప్రజల పల్స్ నాకు తెలుసు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే' Amit shah

by GSrikanth |   ( Updated:2022-11-26 06:59:26.0  )
ప్రజల పల్స్ నాకు తెలుసు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే  Amit shah
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఈ విషయంలో ఎటుంటి నిశ్చింత అక్కర్లేదన్నారు. తాను తరచూ తెలంగాణకు వెళ్తున్నానని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల పల్స్ తనకు తెలుసని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కర్ణాటక తర్వాత దక్షిణ భారత దేశంలో బీజేపీ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతోందన్నారు. తెలంగాణలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2022 లో మాట్లాడిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్వాగతిస్తున్నానన్నారు. ఎవరైనా ప్రయత్నం చేయవచ్చని ప్రయత్నం ఫలితం అనేది లక్ష్యం నెరవేరినప్పుడే తేలుతుందన్నారు. భవిష్యత్ లో రాహుల్ గాంధీ యాత్ర ఫలితం తేలిపోతుందన్నారు. వీర్ సావర్కర్ ను బీజేపీ మాత్రమే కాదు దేశం మొత్తం గౌరవిస్తోందన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా విదేశీయుల కబ్జా కిందకు కిందకు వెళ్లనివ్వమని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తానికి లక్ష్యాన్ని నిర్దేశించారని రాబోయే 25 ఏళ్లలో మనలో చాలా మంది ఇక్కడ ఉండరు. కానీ మా పని ఆ దిశగా ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు. సీఏఏ అమలు చేయడం గురించి అనుమానాలు ఎవరికి వద్దని తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. కరోనా పరిస్థితుల కారణంగానే ఆ ప్రక్రియ అమలులో జాప్యం జరుగుతోందన్నారు.



Also Read......

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో రామ్‌దేవ్ బాబా

Advertisement

Next Story