- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ విషయాన్ని తెలంగాణలోని ప్రతీ ఇంటికి తెలియజేయండి: అమిత్ షా
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో 15 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పారు. డబ్బు రాజకీయాలకు బీజేపీ దూరమని అన్నారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో ఏ మూల కూడా వదలకుండా ఇంటింటికీ వెళ్లి మోడీ పాలన గురించి వివరించాలని సూచించారు. నేతలంతా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకే అజెండాతో పనిచేస్తాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే.. అవినీతి పార్టీలే ఈ మూడు అని అమిత్ షా విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాలని సూచించారు.