Union Budjet: వారిని హైదరాబాద్ లో తిరగనివ్వం!.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
Union Budjet: వారిని హైదరాబాద్ లో తిరగనివ్వం!.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశానికి ఇలాంటి ఆర్ధిక మంత్రి ఉండటం అరిష్టం అని, తెలంగాణ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇవ్వాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధకరమని అన్నారు. విభజన తర్వాత 2 రాష్ట్రాలు చాలా నష్టపోయాయని, పదేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.

నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సందర్భంగా రేషన్ షాపుల దగ్గర ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని డీలర్ ను, కలెక్టర్ ను ప్రశ్నించారని, ఇప్పుడు తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బీజేపీఎంపీలు, కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారిని హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే మూసికి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో సార్లు అడిగినా.. బడ్జెట్ లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరమని అన్నారు. ఇలాంటి ఆర్ధిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి తమ నిజాయితీ నిరుపించుకోవాలని దానం అన్నారు.

Advertisement

Next Story