అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-18 05:45:40.0  )
అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. యూఎస్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ ఇంటరాగేషన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఇన్ టేక్‌లో 2 వేల మంది యూఎస్ నుంచి వెనక్కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే 300 మంది యూఎస్‌లో ల్యాండ్ అయిన వెంటనే తిరిగొచ్చినట్లు సమాచారం. వీసా అప్లికేషన్ సమయంలో సమాచారంపై అక్కడి అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో మన విద్యార్థులు సతమతమవుతున్నారు.

టెన్షన్‌లో చిన్న తడబాటు వచ్చినా అక్కడి అధికారులు క్యాన్సిల్ స్టాంప్ వేస్తున్నారు. మీతో ఎన్ని డాలర్లు తెచ్చుకున్నారు. యూఎస్‌లో ఎక్కడ ఉండబోతున్నారు. వీసా తీసుకోవడానికి సహాయం చేసిందెవరు. అకౌంట్‌లోకి లాగిన్ అయి లోన్ వివరాలు చూపిస్తారా. మీ నాన్న అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి బ్యాలెన్స్ చూపించగలరా. మీ ఫోన్‌లోని పూర్తి సమాచారాన్ని మేము చూడొచ్చా? ఎంబీసీ డాక్యుమెంట్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు.

మీ దగ్గర క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయా వంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు డిపోర్టు అయి ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. అయితే తెలుగు విద్యార్థులను ఎయిర్ పోర్ట్‌లోనే భారత ఇమిగ్రేషన్ టీమ్ ప్రశ్నిస్తోంది. అమెరికా వెళ్లి ఎందుకు తిరిగి వచ్చారనే దానిపై విచారణ చేపట్టారు. అయితే ఇటీవల హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పెద్ద ఎత్తున భారత విద్యార్థులు వివిధ దేశాల్లో విధ్యనభ్యసించడానికి పోటెత్తిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed