MLA Raja Singh : మనకు కొత్త సంవత్సరం ఉగాది : రాజాసింగ్

by Y. Venkata Narasimha Reddy |
MLA Raja Singh : మనకు కొత్త సంవత్సరం ఉగాది : రాజాసింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : జనవరి ఒకటి(January 1st) హిందువుల(Hindus)కు కొత్త సంవత్సరం(New Year ) కాదని, మనకు ఉగాది కొత్త సంవత్సరమ(Ugadi Is The New Year)ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) వ్యా్ఖ్యానించారు. జనవరి ఒకటి ఆంగ్లనామ సంవత్సరం వేడుకలను బ్రిటీష్ పాలకులు మన మీద రుద్ధి వెళ్లారని, ఆ వలస సంస్కృతిని వదిలేయాని ప్రజలను కోరారు. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, పబ్ లు, క్లబ్ లకు వెళ్లడం వంటివి మన సంస్కృతి కాదన్నారు.

కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తుతరాలకు విదేశీ కల్చర్ ను అలవాటు చేస్తున్నారన్నారు. డిసెంబర్ 31, జనవరి 1 వేడుకల పేరుతో హిందువులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాది కొత్త సంవత్సరంగా మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed