ముఖ్యమంత్రి అయిన గంటల్లోనే రేవంత్ రెడ్డికి పోటెత్తిన ట్వీట్స్.. ప్రజలు కోరింది ఇదే..?

by Nagaya |   ( Updated:2023-12-08 13:36:18.0  )
ముఖ్యమంత్రి అయిన గంటల్లోనే రేవంత్ రెడ్డికి పోటెత్తిన ట్వీట్స్.. ప్రజలు కోరింది ఇదే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు, తెలంగాణ ప్రజల మధ్య రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సెక్రటేరియట్‌లో అడుగుపెట్టిన ఆయన.. 11 మంది ఎమ్మెల్యేలకు మంత్రిత్వ శాఖలను కేటాయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నిరుద్యోగ యువతికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలు నూతన ముఖ్యమంత్రికి సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు మా ఆశలన్నీ నీవే అంటూ వారి సమస్యలను పోస్ట్ చేస్తున్నారు.

తెలంగాణ సమాజం నుంచి వివిధ వర్గాల నుంచి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూనే.. సమస్యలను తెలసుపుతూ, సూచనలు చేస్తున్నారు.

‘‘అన్న మీరు ఇప్పుడు మన తెలంగాణా నిరుద్యోగుల ఆశాజ్యోతి.. మీ నాయకత్వం పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలని మన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తూ... మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు’’.

‘‘అన్న ఆర్టీసీ కార్మికుల బకాయిలు 2 PRC లు ఇచ్చి ఆర్థికంగా కార్మికులను ఆదుకోండి sir తక్కువ జీతాలతో చాలా ఇబ్బందులలో ఉన్నాము’’

‘‘మమ్మల్ని కూడా చాలా బెదిరించారు అన్నా తప్పుల్ని ప్రశ్నిస్తే ఏ సంక్షేమ పథకాలను మీకు అందకుండా చేస్తామని బెదిరించారు. నా మనసులో కొన్ని వేల సార్లు అనుకున్నాను. మా తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి మామా సీఎం కావాలి అని, నీ పాలన పాఠ్యపుస్తకాలలో లికించే అంత గొప్పగా ఉండాలి’’

‘‘తెలంగాణ నిరుద్యోగుల సమస్య కూడా చూడండి అన్న కొంచెం అంత అంతటా మిమ్మల్నే నమ్ముకున్నారు అన్న....ఇట్లు ఆంధ్ర యువకుడు...’’

‘‘రాష్ట్రం ముఖ్యమంత్రిని చేసినా రేవంత్ అన్న జై తెలంగాణ అనకపోవడం కొంచెం బాధ కలిగిస్తుంది.’’

‘‘సార్ సామాన్య ప్రజలుకి, రైతులుకి, కూలీలుకి, నిరుద్యోగలుకి నాయ్యము జరగాలి మీ పరిపాలనలో...’’ అంటూ ఇలా వందల ట్వీట్లు చేస్తున్నారు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మీరు మంచిగా ఉంటూ మంచి పరిపాలన చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed