- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు TSRTC గుడ్ న్యూస్.. కొత్త ఐటీఐ కళాశాల ఎక్కడంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(టీఎస్ఆర్టీసీ) ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోగా iti.telangana.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోంది.
తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్, హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు వీసీ సజ్జనార్ ఇవాళ ఒ ప్రకటనలో తెలిపారు. గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని సంస్థ ప్రారంభమైందన్నారు. తాజాగా హకీంపేట ఐటీఐ కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ కొత్త కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం గల ఆర్టీసీ అధికారులచే సంస్థ తరగతులను నిర్వహిస్తుందన్నారు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యాన్ని కల్పిస్తామని స్పష్టంచేశారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం కోసం 9100664452 ఫోన్ నంబర్ ని సంప్రదించాలని వీసీ సజ్జనార్ సూచించారు.
- Tags
- tsrtc