TS RTC: మహిళలకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త.. ఇక ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

by Shiva |   ( Updated:2024-03-12 14:23:35.0  )
TS RTC: మహిళలకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త.. ఇక ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు గాను ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రద్దీ దృష్ట్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ ఎన్టీఆర్‌ మార్గ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రీన్‌ మెట్రో ఎక్స్‌‌ప్రెస్‌ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి 22 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి రానున్నాయి. మెట్రో ఎలక్ట్రిక్ బస్సులోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్‌తో తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను టీఎస్ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో సాధారణ ఛార్జీలే ఉంటాయని సంస్థ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story