- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TS Elections : అభ్యర్థుల నుంచి మీకు ఫోన్ కాల్ వచ్చిందా..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్టేట్ వైడ్‌గా మైక్‌లు బంద్ కానున్నాయి. ఇక, ఇప్పటికే కొంత మంది ఓటర్లకు ఐవీఆర్ఎస్ ( ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ఫోన్ కాల్స్ వచ్చాయి. తమ పార్టీకి ఓట్లు వేయాలని క్యాండిడేట్లు ఫోన్ కాల్ ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఓటర్ల ఫోన్ నంబర్లను పార్టీల అభ్యర్థులు మ్యాపింగ్ చేసి.. అభ్యర్థిగా తమ పేరును పరిచయం చేసుకుని ఓటు వేయాలని రికార్డు చేసిన వాయిస్‌ను పంపిస్తున్నారు. కాగా మీకు అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్ వస్తే మీకు ఓటు ఉన్నట్లుగా భావించొచ్చు. ఈసీ వెబ్‌సైట్ లో ఫోన్ నంబరు ద్వారా వివరాలు తెలుసుకునే వీలుంది. తెలంగాణలో ఈనెల 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.