TS Assembly: విపక్షాల వింత పోకడ.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే గందరగోళం

by Shiva |
TS Assembly: విపక్షాల వింత పోకడ.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే గందరగోళం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని, రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కోరుతూ.. బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA's)లు ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) ట్రాక్టర్ నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్యేలు అదానీ (Adani), రేవంత్ రెడ్డి (Revanth Reddy) బొమ్మలతో కూడిన టీషర్ట్‌లను ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. రేవంత్, అదానీ దోస్తానా, ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ తల్లి మాది.. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ స్లో‌గన్స్‌తో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీషర్టులు విప్పేసి లోనికి వెళ్లాలని సూచించారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా ఎమ్మెల్యేలు మాట వినపోవడంతో అందరినీ అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed