- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TS 10th Results: నేడు టెన్త్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ టెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. దాదాపు 5,08,385 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ క్రమంలో ఫలితాల కోసం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అదేవిధంగా తొలిసారిగా తెలంగాణలో 10వ తరగతి మార్కుల మెమోలపై పెన్ (Permanent Education Number) నెంబర్ ముద్రించే దిశగా విద్యా శాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్‌ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా 10వ తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన సెక్యూరిటీ ఫీచర్లతో ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది.