- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సజ్జనార్ సార్.. బస్సుల్లేక ఇబ్బంది పడుతున్నాం.. ట్వీట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజా రవాణా ఆర్టీసీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సజ్జనార్.. పీక్ అవర్స్‌లో హైదరాబాద్‌లో సిటీ బస్సుల కొరతతో నగరవాసులు పడుతున్న ఇబ్బందులను తీర్చలేకపోతున్నారు. మారు మూల గ్రామాలకు సైతం బస్సు కావాలని కోరిన నెటిజన్లకు వెంటనే స్పందించి బస్సు అరేంజ్ చేస్తున్నారే కానీ, నగరంలోని కొన్ని రూట్లలో బస్సుల కొరత ఉందని ట్వీట్లు చేస్తున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా, కొందరు మహిళా ప్రయాణికులు 113 బస్సుల కొరత ద్వారా పడుతున్న ఇబ్బందులను ట్విట్టర్ వేదికగా సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై వెంటనే స్పందించిన సజ్జనార్.. సంబంధిత అధికారులకు ట్యాగ్ చేస్తూ సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే, దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. గత రెండేళ్లుగా నేను ఈ సమస్య గురించి చెబుతున్నా..ఎలాంటి మార్పు రాలేదని ఆరోపిస్తున్నారు.
113 నెంబర్ రూట్ లో సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం, సాయంత్రం ఈ రూట్ లో బస్సులను పెంచితే బాగుంటుంది సర్. మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు @tsrtcmdoffice @marksDudam @dishatelugu @TSRTCHQ pic.twitter.com/eWbOasu7d6
— M.Sunitha Goud (@MSunithaGoud1) March 9, 2022