ట్రాప్ చేసి వాట్సాప్ Nude calls.. ముగ్గురు అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-26 14:03:08.0  )
ట్రాప్ చేసి వాట్సాప్ Nude calls.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సోషల్​మీడియా ద్వారా విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురిని ఘట్​కేసర్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు మొబైల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ జానకి సోమవారం ఘట్​కేసర్​పోలీస్​స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకు మండలం కొర్రెపాడు గ్రామానికి చెందిన చొప్పర లక్ష్మీగణేశ్​(20) ఇంటర్​ఫెయిల్ అయి ప్రస్తుతం కూలీగా పని చేస్తున్నాడు. కాకినాడ టౌన్​నివాసి కొత్తగిరి వీరబాబు (20), చిట్టిబోయిన దుర్గారాజు (25) అతనికి ఇన్​స్టా స్నేహితులు.

ఇదిలా ఉండగా ఈనెల 22న ఘట్​కేసర్​పోలీస్​స్టేషన్​పరిధిలోని ఓ ఇంజనీరింగ్​కాలేజీ ప్రిన్సిపల్​పోలీస్​స్టేషన్‌కు వచ్చి తమ కాలేజీలో చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న కొంత మంది విద్యార్థినులకు అగంతకులు వాట్సాప్​కాల్స్​చేస్తూ వేధిస్తున్నట్టుగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మొబైల్​నెంబర్ల ఆధారంగా విచారణ చేయగా విజయవాడ, కాకినాడ నుంచి ఆ కాల్స్​వస్తున్నట్టు తేలింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసిన ఘట్​కేసర్​సీఐ మహేందర్​రెడ్డి, ఎస్సైలు సుధాకర్, అశోక్, శ్రీకాంత్, హెడ్​కానిస్టేబుల్​శంకర్, కానిస్టేబుళ్లు రాజేశ్, నాగరాజు, ఆంజనేయులు, అరవింద్​లను డీసీపీ జానకీ అభినందించారు.

వందల సంఖ్యలో...

ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న లక్ష్మీగణేశ్​ఇదే కాలేజీకి చెందిన దాదాపు మూడు వందల మందిని వాట్సాప్​ద్వారా బ్లాక్​మెయిల్​చేసి వారిని చిత్రహింసలకు గురి చేశాడు. మొదట ఇన్​స్టాగ్రామ్​ద్వారా ఈ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినితో స్నేహం ఏర్పరుచుకున్న లక్ష్మీగణేశ్​తీయని ఛాటింగులు చేస్తూ ఆమెకు సన్నిహితునిగా మారాడు. ఆ తరువాత ఒకటి రెండుసార్లు కాలేజీ వద్దకు వచ్చి ఆమెను కలిశాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఫోటోలు సంపాదించిన లక్ష్మీగణేశ్​వాటిని మార్ఫింగ్​చేసి అభ్యంతరకరంగా మార్చాడు. వాటిని సదరు విద్యార్థినికి పంపించి తాను చెప్పినట్టుగా న్యూడ్​కాల్​చేయాలని, లేనిపక్షంలో మార్ఫింగ్​చేసిన ఫోటోలను సోషల్​మీడియాలో వైరల్​చేస్తానని బెదిరించాడు.

దాంతో భయపడ్డ విద్యార్థిని అతను చెప్పినట్టు చేసింది. వీటిని రికార్డు చేసిన లక్ష్మీగణేశ్​తిరిగి వాటిని విద్యార్థినికి పంపించి నీ స్నేహితురాళ్ల నెంబర్లు పంపించమన్నాడు. దాంతో ఆమె నెంబర్లు పంపించింది. ఆయా నెంబర్ల డీపీల్లో ఉన్న ఫోటోలను డౌన్​లోడ్​చేసిన లక్ష్మీగణేశ్​వాటిని కూడా మార్ఫింగ్​చేసి ఆయా విద్యార్థినులకు పంపించాడు. అంతటితో ఆగకుండా సోషల్​మీడియాలో తనకు పరిచయమైన మరో ముగ్గురికి ఈ ఫోటోలను షేర్​చేయగా వాళ్లు కూడా విద్యార్థినులను చిత్రహింసకు గురి చేశారు. దాంతో విద్యార్థినులు తమను ఈ వేధింపుల నుంచి రక్షించాలని డిమాండ్​చేస్తూ కాలేజీ ఎదుట ఆందోళన కూడా జరిపారు. తమ ఫోటోలు బయటకు వస్తే ఆత్మహత్య చేసుకుంటామన్నారు.

దాంతో పోలీసులు రంగంలోకి దిగి లక్ష్మీగణేశ్‌తో పాటు మరో ముగ్గురిని ఆ కేసులో అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన తరువాత లక్ష్మీగణేశ్​తన మొబైల్​పాత నెంబర్‌ను తిరిగి తీసుకుని దాని ద్వారా గూగుల్​డ్రైవ్‌లో స్టోర్​అయి ఉన్న ఫోటోలను బయటకు తీసి మళ్లీ విద్యార్థినులను వేధించటం ప్రారంభించాడు. ఇన్​స్టా ద్వారా తనకు పరిచయం అయిన వీరబాబు, దుర్గారాజులకు కూడా వాటిని షేర్​చేయగా వాళ్లు కూడా విద్యార్థినులను బ్లాక్​మెయిల్​చెయ్యటం ప్రారంభించారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపల్​ఫిర్యాదు చేయగా ఘట్​కేసర్​పోలీసులు మరోసారి లక్ష్మీగణేశ్ ను అరెస్టు చేశారు. మిగితా ఇద్దరు నిందితులను కూడా కటకటాల వెనక్కి పంపించారు.

Advertisement

Next Story

Most Viewed