- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాప్రతినిధుల సిఫార్సుతో ట్రాన్స్‌ఫర్స్.. పోలీస్ బదిలీల్లో రచ్చ
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన బదిలీల వ్యవహరం హాట్ టాఫిక్‌గా మారింది. మార్చి నెలలో జరిగిన పోలీసు కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్సైల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీల ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. పదుల సంఖ్యలో జరిగిన పోలీసు సిబ్బంది స్థానచలనంపై తలోదిక్కుగ చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏడేళ్లుగా కదలకుండా విధులు నిర్వహించిన ఇద్దరు సిబ్బందిని మార్చి నెలలో బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకుని వారికి కేటాయించిన స్థానానికి చేరకముందే తిరిగి రద్దు చేసి అక్కడే పోస్టింగ్ లు ఇవ్వడంపై ఖాకీల్లో అసహనం వ్యక్తమవుతుంది.
-దిశ ప్రతినిధి, నిజామాబాద్
సాధారణంగా మూడేళ్లు ఒకచోట పని చేసిన వారిని, ఐదేళ్లు పూర్తి చేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాల్సిందే. పోలీసు కమిషనర్‌కు కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైల బదిలీ అధికారం ఉంది. ఎస్సైల నుంచి పై అధికారుల బదిలీల వరకు వెస్ట్ జోన్ ఐజీ నుంచి డీజీపీ వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఖరి సంవత్సరం ముగింపునకు ముందు వేసవి సెలవులు ప్రారంభానికి ముందే చాలా మంది పోలీసు శాఖలో ఏళ్ల తరబడిగా పని చేస్తున్న వారు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు.
కమిషనర్‌కు అధికారం ఉండ డంతో ఈ ప్రక్రియను ఆయన కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. అందుకు దరఖాస్తులను తీసుకుని పరిశీలించి స్థానచలనానికి అవకాశం ఇచ్చారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఐదేళ్లు నిండిన వారిని స్థానచలనం చేసి రూల్స్ పాటించారు. కానీ కొన్ని చోట్ల రూల్స్‌కు విరుద్దంగా బదిలీ చేయడం, చేసిన వారికి అక్కడే పోస్టింగ్ ఇవ్వడంపై సిబ్బంది లబోదిబోమంటున్నారు. కొందరి కనుసన్నుల్లోనే బదిలీలు జరిగాయని చెప్పుకుంటున్నారు.
గతంలోనూ కానిస్టేబుళ్ల బదిలీలకు నిజామాబాద్‌లో మంత్రి మొదలుకుని ఎమ్మెల్యేల వరకు సిఫారసు లేటర్‌లను ఇచ్చిన చరిత్ర నిజామాబాద్ జిల్లాలో ఉంది. 2020 సంవత్సరం ఆరంభంలోనే ఒక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే బదిలీలకు 27 సిఫారసు లేటర్లు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. శుక్రవారం వరకు జరిగిన బదిలీల్లోనూ ఒత్తిడి ఉంది అని వాదనలు ఉన్నాయి. కొందరు ఉన్నతాధికారులు కనుసన్నుల మేరకే ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకే బదిలీలు జరిగాయని పోలీసు శాఖ కోడైకూస్తోంది.
ఇవి కూడా చదవండి: TS: పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. SI, ASI పరీక్షల తేదీలు ఖరారు