- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Training: ఎమ్మెల్యేలకు ట్రైనింగ్..! టీపీసీసీ సూచనతో సర్కార్ టేకప్
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని సర్కార్ ప్లాన్ చేసింది. సభలో ప్రవేశ పెట్టబోయే బిల్లులు, ప్రసంగించాల్సిన తీరుపై సీనియర్ నేతలు, మంత్రులు శిక్షణ ఇవ్వనున్నారు. అంశాల వారీగా అవగాహన కల్పించనున్నారు. సభలో కీలకంగా ప్రవేశపెట్టే అంశాలపై మాట్లాడేందుకు కొందరు ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశారు. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల జాబితాను రెడీ చేసిన ప్రభుత్వం, అసెంబ్లీ వర్గాలకు కూడా అందజేసింది. సభలో ఆయా సభ్యులు మాట్లాడే కంటే ముందే సీనియర్ మంత్రులు.. సభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించనున్నారు. ప్రత్యక్షంగా లేదా జూమ్ విధానంలో ఈ ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే టీపీసీసీ నుంచి కూడా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ అందింది. దీంతో సీఎం, కేబినెట్ మంత్రులు ఈ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశారు. సోమవారం అసెంబ్లీ సెషన్ ముగియగానే దాదాపు మూడు రోజులపాటు సభ వాయిదా పడనున్నది. ఈ సమయంలో సెలెక్ట్ చేసిన ఎమ్మెల్యేలకు బ్రీఫింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. గత సెషన్ లో ఇదే విధానాన్ని అవలంభించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ లేదని సర్కార్ భావిస్తున్నది. దీంతో మరోసారి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది.
సబ్జెక్టుపై కౌంటర్ల ఫైర్
కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో దాదాపు యాబై శాతానికి పైగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. గత సెషన్ లో సభ సాంప్రదాయాలు, నిబంధనలపై అవగాహన కల్పించిన సర్కార్, ఈ దఫా సబ్జెక్టుపై మాట్లాడాల్సిన తీరు, ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్లు, వివరణ ఇవ్వడంపై తర్ఫీదు ఇవ్వనున్నారు. దీంతోపాటు బిల్లులపై స్పష్టత ఇవ్వడం వలన ప్రసంగించే సమయంలో లోపాలు, తప్పిదాలు జరగవనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నది. అంతేగాక బిల్లులకు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎలా మాట్లాడాలి? సబ్జెక్టును అవగాహన చేసుకోవడం ఎలా? ప్రతిపక్షాలు మధ్యలో ఇన్వాల్వ్ అయినప్పటికీ, ఎదురుదాడి చేయాల్సిన ప్లాన్లు వంటివాటిపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధానంగా రైతు, మూసీ, హైదరాబాద్ అభివృద్ధి, సంక్షేమం, వైద్యం అంశాలను ప్రభుత్వం ప్రధానంగా ఎంపిక చేసింది. వీటిపై అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేసినట్లు ప్రభుత్వంలోని ఓ కీలక నేత తెలిపారు.