విషాదం.. ప్యారా గ్లైడింగ్ చేస్తుండగా కింద‌పడి మహిళ..

by Sathputhe Rajesh |
విషాదం.. ప్యారా గ్లైడింగ్ చేస్తుండగా కింద‌పడి మహిళ..
X

దిశ, జహీరాబాద్: హిమాచల్ ప్రదేశ్ కులుమనాలిలో ప్యారా గ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటనలో సాయి మోహన్ భార్య పేరూరి నవ్య అనే మహిళ మృతి చెందింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మృతురాలి కుటుంబ సభ్యులది కోదాడ కాగా కొంతకాలంగా వారు జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్‌లో గల శిల్ప వెంచర్‌లో స్థిరపడ్డారు. కొడుకు చండీగడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కులుమనాలిలో ప్యారా గ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి నవ్య మృతి చెందింది. ఈ సంఘటన వారి కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది.

Advertisement

Next Story

Most Viewed