- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TPCC: ఆత్మపరిశీలన చేసుకో కేటీఆర్.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) వర్ధంతి(Death Anniversary) రోజున కూడా కేటీఆర్(KTR) రాజకీయం చేయాలని చూడటం విచారకరమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar) అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ(Congress party)కి అంబేద్కర్ కు నివాళులు(Tribute) అర్పించడం కూడా ఇష్టం లేదు అనే ప్రచారం చేయడం సరికాదన్నారు. విజయోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ కు నివాళులు అర్పించే కార్యక్రమం ఉందని, మీ లాగా పూలదండలు కూడా వేయకుండా నివాళులు అర్పించే సంస్కృతి కాదని, కేసీఆర్(KCR) పెద్ద విగ్రహం పెట్టడం కాదు.. ఎన్ని సార్లు నివాళులు అర్పించారో ఆత్మపరిశీలన చేసుకోవాలని విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తా అని, అంబేద్కర్ ఆశయాలకు విరుద్దంగా పాలన నడిపిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. దళితులకు, ఆదివాసీలకు సమస్యలు ఉన్నట్లు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మీద కేసులు పెట్టినట్లు మాట్లాడటం అర్థరహితం అన్నారు.
కులరహిత సమాజం కోరుకున్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్(Intigrated Schools) నిర్మాణం చేయబోతున్నామని, కేసీఆర్ గురుకులాలపై కేజీ టు పీజీ(KG TO PG) విద్య అని ప్రగల్భాలు పలికి ఏమి చేయలేదని, కేటీఆర్ మాట్లాడేటప్పుడు మీ తప్పులు మీకు గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ తల్లి(Telangana Thalli Statue) ప్రాంతీయ తత్వం ఉట్టిపడేలా ఉంటుందని, మీలాగా రాజసం ఉట్టి పడేలా.. విలాసవంతంగా ఉండదని, తెలంగాణలో సగటు మాతృమూర్తి ఎలా ఉంటుందో అలా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో మాట్లడేందుకు మీకు ఎజెండా కూడా లేదని, అసలు కేసీఆర్ అసెంబ్లీ(Assembly)కి వస్తారో రారో మీకే తెలియదని దుయ్యబట్టారు. ముందు ప్రతిపక్ష నాయకుల పాత్ర సమర్ధవంతంగా పోషించాలని, ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తే అది కాస్త హింసగా మారుతుందని సలహాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అసత్య ప్రేలాపణలు చేస్తున్నారని, దేశంలో రాజ్యంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని, మీ నాయన లాగా రాజ్యాంగాన్ని మారుస్తా అని అనలేదని చెప్పారు. ఇక పదేళ్లలో చేయనిది మళ్లీ వచ్చాక చేస్తామనడం సిగ్గుచేటని అద్దంకి దయాకర్ అన్నారు.