- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPCC chief: సీఎం మార్పు విమర్శలపై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై నవంబర్ 5వ తేదీ సాయంత్రం బోయినపల్లిలోని కాంగ్రెస్ ఐడియాలజీ సెంటర్ లో పీసీసీ ఆధ్వర్యంలో మేధావుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Ghandi) పాల్గొంటారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి మల్లికార్జున ఖర్గే ( mallikharjuna kharge) ను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని సమయం దొరికితే ఈ కార్యక్రమానికి ఆయన కూడా హాజరుఅవుతారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్ గాంధీ వివరాలు తెలుసుకుంటారన్నారు. శనివారం గాంధీ భవన్ లో కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, ఆయన ప్రశ్నలను సైతం అంగీకరిచరని విమర్శించారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అందుకు భిన్నంగా విమర్శలను కూడా రాహుల్ గాంధీ పాజిటివ్ గా తీసుకుంటారని చెప్పారు. వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో పీసీసీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చేందుకు అంగీకరించారన్నారు. కులగణన (caste census in telangana)లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏదైనా సలహాలు, సందేహాలు ఉంటే ఈ కనెక్టివిటీ సెంటర్ ను సంప్రదించవచ్చను తెలిపారు. భవిష్యత్ అవసరాలు, కార్యక్రమాల కోసం కొంత మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను వారి జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లోని అసెబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలుగా పంపించబోతున్నట్లు వెల్లడించారు. సీనియర్లను కోఆర్డినేటర్లుగా నియమిస్తామన్నారు.
మహేశ్వర్ రెడ్డికి దక్కుతున్న గౌరవం ఏంటో అందరికీ తెలుసు:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు స్వతంత్రంగా పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఉండగా కొత్త ముఖ్యమంత్రి ప్రస్తావన తెస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) కి సీఎల్పీ నాయకుడిగా బీజేపీలో దక్కుతున్న గౌరవం గురించి ఆలోచించుకోవాలన్నారు. అక్కడ ఆయనకు ఇస్తున్న గౌరవం గురించి అదరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. మహేశ్ రెడ్డి నాకు మంచి మిత్రుడే అని కానీ కాంగ్రెస్ లోని విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. ఉత్తమ్, భట్టి అందరూ సీనియర్ నేతలన్నారు. వంచనకు గురిచేసిన కేసీఆర్ ను ప్రజలు దించేసి మామీద నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారని అందువల్ల మా ముందున్నది మాలో ఎవరు మంత్రులు, ముఖ్యమంత్రులు అవతారని కాదని ప్రజలకు ఎలా మేలు చేయాలన్నదే మా ముందున్నదన్నారు. బీజేపీ ఆఫీస్ లో మహేశ్వర్ రెడ్డికి కుర్చీలేదని, కిషన్ రెడ్డి (Kishan Reddy) కి ఏలేటికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయనే సమాచారం మాకూ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ మిగతా ఏ పార్టీలో లేదని బీజేపీలో అంతకన్నా లేదన్నారు. మాపాలన పట్ల ప్రజలు సంతృప్తిలో ఉన్నారన్నారు.
మోడీ ఇచ్చిన హామీలేమయ్యాయి?:
కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న మోడీ (MODI) ముందు మీరిస్తానన్న సంక్షేమ పథకాలు, 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొత్తవి ఇచ్చే బదులు ప్రభుత్వ సంస్థలను అమ్మేసి ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారని ధ్వజమెత్తారు. పేదలు, రైతుల గురించి మాట్లాడే హక్కు మోడీకెక్కడిదన్నారు. కులగణన అంశంపై ఈ నెల 6 లేదా 7న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ మాదిరిగా మాది ఫాసిస్టు ప్రభుత్వం కాదన్నారు. కులగణన సమగ్రంగా నిష్పక్షపాతంగా జరగాలనేది మా ఆలోచన అన్నారు. కేసీఆర్ చేసిన సమగ్ర కులగణన రిపోర్టు ఏమైందని ప్రశ్నించారు. ప్రజా ధనంతో ఆగమేగాల మీద సర్వే చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వివరాలు ఎందుకు బయటపెట్టలేదని విమర్శించారు. మల్లికార్జున ఖర్గే మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆర్థిక పరిస్థితి చూసుకుని హామీలు ఇవ్వాలని ఖర్జే చెప్పారన్నారు. మూసీకి లక్షకోట్లని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. డీపీఆరే సిద్ధం కానిది లక్ష కోట్లని ఎలా చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమిచ్చిన ఆరుగ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.