- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా నిర్వహించబోయే బహిరంగ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు డీజీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం సభకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
వెంటనే తమ కార్యకర్తల వాహనాలు అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని రేవంత్ కోరారు. సభకు వెళ్లే వాహనాలు అడ్డుకోకుండా ఆదేశాలు ఇస్తామని రేవంత్‌కు డీజీపీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సభను చూస్తే.. బీఆర్ఎస్ నేతల వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. సభకు వెళితే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నారని అన్నారు. అధికారులు పద్దతి మార్చుకోకుంటే తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.