TSLPRB చైర్మన్‌గా తెలంగాణ అధికారి లేడు: Revanth Reddy

by GSrikanth |   ( Updated:2023-01-27 11:07:54.0  )
TSLPRB చైర్మన్‌గా తెలంగాణ అధికారి లేడు: Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన దేహదారుడ్య పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వెంటనే జరిగిన అవకతవకలను సరిచేసి 1600 మీటర్ల రన్నింగ్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులందరికీ తుది పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పోలీస్ అభ్యర్థుల ఆందోళనలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీలక డిమాండ్స్ చేశారు. ''పోలీస్ ఉద్యోగ నియామకాలపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాను. ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నియామకాల కోసమే మళ్లీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్ధితి. రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్‌గా తెలంగాణ అధికారి లేడు. కీలక శాఖలన్నింటిలో తెలంగానేతరులను నియమించారు. పరిపాలన అందించడానికి ఏ ఒక్క తెలంగాణ అధికారులకు సమర్ధత లేదా? తెలంగాణ అధికారులను, ప్రజలను కేసీఆర్ నమ్మడం లేదు. నియామకాలు చేపట్టకపోతే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం.'' అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేసీఆర్‌పై మండిపడ్డారు.

Also Read...

తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్.. BRS కు చెక్ పెట్టేలా ప్లాన్

Advertisement

Next Story

Most Viewed