- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా?
దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయం ఏమైనా సీఎం కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై శుక్రవారం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ నుండి సచివాలయానికి వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, కాంగ్రెస్ నేతల అరెస్టుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజానిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా? అని ప్రశ్నించారు. అంత రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని నిలదీశారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సచివాలయంలో అగ్నిప్రమాదం పై నిజానిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) February 3, 2023
సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా?
అంత రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణం విడుదల చేయాలి. pic.twitter.com/izhcYmBKOt