- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy : కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ జైలుకు పంపుతాం.. ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ కు జైలుకు పంపుతామని అన్నారు. పిలుపునిచ్చారు. ఏపీలో పార్టీ బలహీనపడుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ.. ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిందని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు.
వృద్ధులు, వితంతువులకు నెలకి రూ.4 వేల పెన్షన్ ఇస్తామని అన్నారు. అలాగే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలతో పాటు భట్టి విక్రమార్క తన పీపుల్స్ మార్చ్ లో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పారు. సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ ౯న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. కాగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఆయన సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.
Read More..