Mahesh Kumar Goud: మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లేఖ

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాలయ కమిటీల్లో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లను నియమించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) లేఖ రాశారు. ట్రస్ట్ బోర్డ్‌లలోనూ అవకాశం ఇవ్వాలని కోరారు. దీని వలన ప్రభుత్వం చేపట్టిన ఆలయ కార్యక్రమాలు, అభివృద్ధి వంటివన్నీ ప్రజలకు సులువుగా చేరతాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెంపుళ్లలో ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతాయని వివరించారు. వెంటనే పరిశీలించి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల నియామకానికి చొరవ చూపాలని ఆయన లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed