- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీఆర్- కవిత- హరీష్ మధ్య మూడు ముక్కలాట.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేటీఆర్ (KTR) మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని, బీఆర్ఎస్‌లో కేటీఆర్ - కవిత (MLC Kavitha) - హరీష్‌రావు (Harish Rao)ల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) హాట్ కామెంట్స్ చేశారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. సోమవారం గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్ -4 వద్ద టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యిందని విమర్శించారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన (KCR) కేసీఆర్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్‌హౌస్‌లో సేద తీరుతున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ విమర్శించారు.
జరగబోయే (MLC Elections) ఎమ్మెల్సీ ఎన్నికల్లో (BRS) బీఆర్ఎస్- బీజేపీ (Telangana BJP) దోస్తీ కట్టిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని తెలిపారు.
ఇక బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని విమర్శించారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం వారి ఆనవాయితీ అని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్ట మొదటిగా తెలంగాణలో కుల గణన సర్వే జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. కుల గణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని, పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు.