తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?

by D.Reddy |   ( Updated:2025-01-27 09:05:01.0  )
తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈనెల 28న(రేపు) స్కూళ్లకు సెలవు ఉండనుంది. 'షబ్‌ ఏ మేరాజ్‌' ముస్లీం పండుగ నేపథ్యంలో ప్రభుత్వం ఆప్షనల్‌ హాలి డే ప్రకటించింది. అయితే, మార్చి నెలలో పలు పబ్లిక్‌ పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యా సంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి. మిగతా విద్యాసంస్థలు స్వీయ నిర్ణయం ప్రకారం తరగతులు జరిగే అవకాశం ఉంది. ఇక షబ్ ఏ మేరాజ్‌ పండుగను ముస్లీంను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు వారు జాగరణ చేస్తారు. మసీదులను దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు.

Next Story