- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కేసీఆర్, కేటీఆర్‌లకు టాలీవుడ్ సింగర్ రిక్వెస్ట్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: గల్లీ నుండి ఢిల్లీ వరకు రాజకీయ నేతల హడావుడి అంతా ఇంతా ఉండదు. తాము రోడ్డుపైకి వస్తే మిగతా వారంతా తప్పుకోవాల్సిందే అనేలా కొంతమంది నేతలు ప్రవర్తిస్తుంటారు. నేతల కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా అవేవి మాకు పట్టవ్ అన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు. అలాంటి అనుభవమే సింగర్ శ్రీరామచంద్రకు ఎదురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను గోవా వెళ్లేందుకు బయలుదేరానని అయితే ఓ రాజకీయ నేత కోసం పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌ను బ్లాక్ చేశారని దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన వాహనాలన్నీ కింది నుంచి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
దాంతో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుని చివరకు గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ప్రోగ్రామ్‌కు అటెండ్ కాలేకపోయానన్నారు. తనతో పాటు మరో 15 మంది కూడా తమ ఫ్లైట్స్ మిస్ అయ్యారని ఇది చాలా విచారకరం అని దయచేసి తెలంగాణ సీఎం కేసీఆర్, మినిస్టర్ కేటీఆర్ ఇలాంటి విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొలిటికల్ లీడర్ల కోసం సామాన్య జనాలకు ఇబ్బంది పెట్టకండి దయచేసి అర్థం చేసుకోవాలంటూ వీడియో పోస్ట్ చేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు శ్రీరామచంద్రకు మద్దతుగా నిలుస్తున్నారు.