- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana:ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు, ఇంప్రూవ్‌మెంట్ కోసం ప్రయత్నించేవారు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఆన్సర్ పేపర్ల మూల్యాంకనం ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ రోజు (జూన్ 24) మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఫలితాలు విడుదల సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.