ఘనంగా జరుగుతున్న ఐదవ రోజు.. అట్ల బతుకమ్మ వేడుకలు

by M.Rajitha |   ( Updated:2024-10-06 13:02:39.0  )
ఘనంగా  జరుగుతున్న ఐదవ రోజు.. అట్ల బతుకమ్మ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా తొమ్మిదిరోజుల బతుకమ్మ వేడుకల్లో నేడు ఐదవ రోజును అట్ల బతుకమ్మగా తెలంగాణ మహిళలు సంబురంగా జరుపుకుంటున్నారు. ఈ ఐదవ రోజున బతుకమ్మకు నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు. ఉప్పుడు బియ్యం నానబోసి, వాటిని రుబ్బి అట్లు పోసి.. బతుకమ్మల వద్ద నైవేద్యంగా పెడతారు. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆడపడుచులు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడి, ఆ అట్లను ఒకరికి ఒకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇక ఐదవ రోజున కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మను ఐదు అంతస్తుల్లో పేర్చుతారు. ఇక రేపు ఆరవ రోజున అర్రెం బతుకమ్మ అంటారు. అంటే రేపు బతుకమ్మ అలిగిన రోజుగా చెప్పుకొని, బతుకమ్మ ఆడరు.

Advertisement

Next Story

Most Viewed