షో చేసే వారికే టికెట్లు.. బీజేపీ అభ్యర్థి మాధవిలతపై కరాటే కల్యాణీ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-03-08 14:08:30.0  )
షో చేసే వారికే టికెట్లు.. బీజేపీ అభ్యర్థి మాధవిలతపై కరాటే కల్యాణీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ బీజేపీలో ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ టికెట్ ఆశించి భంగపడిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభ్యర్థి విషయంలో బీజేపీలో పరిస్థితి నిప్పు ఉప్పు మాదిరిగా మారింది. ఈ స్థానానికి అభ్యర్థిగా కొంపల్లి మాధవిలతకు అధిష్టానం అవకాశం కల్పించడంపై బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మరువకముందే తాజాగా సినీనటి, బీజేపీ నేత కరాటే కల్యాణీ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో సంచలనంగా మారాయి. కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా హిందుత్వవాది అని సోషల్ మీడియాలో షో చేస్తున్నవారికి టికెట్లు ఇస్తున్నారని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అనంతరం ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ మాధవిలతకు టికెట్ రావడం సంతోషమేనని అయితే ఎన్నికలప్పుడే ఆమె పార్టీలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్లాన్ ప్రకారమే తన పేరు వినిపించేలా రూ.లక్షలు ఖర్చు:

హైదరాబాద్ సీటు దక్కించుకునేందుకు మాధవిలత ప్లాన్ ప్రకారమే అనేక మందికి లక్షలాది రూపాయలు చెల్లించి యూట్యూబ్ లో పెత్త ఎత్తున తన పేరు వినిపించేలా ప్రచారం చేసుకున్నారని కరాటే కల్యాణి ఆరోపించారు. అసలు అభ్యర్థిగా ప్రకటించే సమయానికి ఆమెకు బీజేపీ సభ్యత్వమే లేదని ఈ విషయం రాజాసింగ్ తో పాటు అనేక మంది చెబుతున్నారన్నారు. రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయక్వతం ఆర్టిస్టులను యూజ్ అండ్ త్రో గానే చేస్తోందని ధ్వజమెత్తారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో తమను పిలిపించి ప్రచారం చేయిస్తారని, ఆతర్వాత మోడీ వంటి నేతలు వచ్చినప్పుడు తమకు కనీసం పిలిచి తమ సేవలు వారి దృష్టికి తీసుకువెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పదవులు, సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తనకు టికెట్ ఇచ్చేందుకు అనేక పార్టీలు ముందుకు వచ్చాయని అయితే తాను తాను తెలంగాణ నుంచి టికెట్ ఆశించడం లేదన్నారు. ఏపీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానన్నారు. తెలంగాణ బీజేపీలో మాధవిలత టికెట్ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Read More..

ఎన్టీఆర్‌ను మించిపోతారనే రంగా హత్య.. పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story