గుడిసెల్లోకి దూసుకెళ్లిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

by GSrikanth |   ( Updated:2023-03-02 04:17:32.0  )
గుడిసెల్లోకి దూసుకెళ్లిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
X

దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి గుడిసెలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులు కర్ణాటకకు చెందిన బాబు రాథోడ్(48), కమలి బాయ్(43) , బస్సప్ప రాథోడ్ (23)గా గుర్తించారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులని పేర్కొన్నారు. వీరంతా రింగ్ రోడ్ పక్కన ఉన్న చెట్లకు నీరు పోసే వలస కూలీలని మియాపూర్ ఏసీసీ నర్సింహ రావు తెలిపారు. మృతుల కుటుంబాలను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు.

Advertisement

Next Story