పాకిస్తాన్ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్!

by GSrikanth |   ( Updated:2023-03-22 03:41:23.0  )
పాకిస్తాన్ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనకు బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయని, దాదాపు 8 నెంబర్ల నుంచి కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ బెదిరింపు కాల్స్‌ ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వస్తున్నాయని అన్నారు. ఈ విషయమై తాను పోలీసులకు గతంలోనే కంప్లైంట్ ఇచ్చినా.. ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని డీజీపీకి తెలియజేశారు. అంతేగాక, గన్ లైసెన్స్ కోసం ఇప్పటికే చాలాసార్లు అభ్యర్థించానని, తనపై కేసులు ఉన్నాయని గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని తెలిపారు. కేసులు ఉన్నా గన్ లైసెన్స్ పొందిన వాళ్లు అనేక మంది ఉన్నారని, తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు

Advertisement

Next Story