MLA Satyam : చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యంకు బెదిరింపు కాల్స్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-30 10:22:15.0  )
MLA Satyam : చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యంకు బెదిరింపు కాల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Chhoppadandi Congress MLA Satyam) కు బెదిరింపు కాల్స్(Threatening calls) రావడం కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు ఎమ్మెల్యే సత్యంకు గత సెప్టెంబర్ నెలలో 28వ తేదీన మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో తెలియని నెంబర్ +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ రాగా, నిందితుడు కాల్ లో మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని ఎమ్మెల్యే సత్యంను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని.. తన ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు.

తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని, ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉన్నాడని గుర్తించారు. అక్కడినుండే బెదిరింపులకు పాల్పడ్డాడని తేలిందని సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశామని ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు.

Advertisement

Next Story