- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ALERT : రైతులు బీ అలర్ట్.. రుణమాఫీ వేళ సైబర్ నేరగాళ్ల ముప్పు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రారంభించింది. అయితే, రుణమాఫీ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చి పోయే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తమకు రుణమాఫీ జరుగుతుందో లేదో అనే రైతులు ఉత్సుకతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రైతుల వాట్సాప్ లోకి ఏపీకే ఫైల్స్ లింకులు, మెసేజ్‌లు పంపుతున్నారని సమాచారం. దీంతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెప్పకండన్నారు. సైబర్ ఎటాక్ విషయంలో ఏదైనా ఫిర్యాదులు ఉంటే 1930 కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.