- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీడీపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎలా ఉందంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాల్లో పరస్పరం గట్టిపోటీ ఉండనున్నట్లు పంచాంగంలో వెళ్లడైంది. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని, ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికార పార్టీలను ఢీకొంటాయని డాక్టర్ నాయకంటి మల్లిఖార్జున శర్మ వెల్లడించారు. శోభకృత్ నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో ఉగాది వేడుకలను నిర్వహించారు. మల్లికార్జునశర్మ పంచాంగ శ్రవణం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయని, వారి నాయకత్వంలో టీడీపీకి విజయం చేకూరే అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు.
అధికార పార్టీకి ప్రతిపక్షం గట్టి పోటీ ఇవ్వనున్నాయన్నారు. ప్రజల ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందని, రాజకీయ పార్టీల్లో కూడా మార్పులు వచ్చాయని దీని కారణంగా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. మేఘాధిపతి గురుడు కావటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రాష్ట్రం, దేశం మొత్తం పాడిపంటలతో సస్యశ్యామలంగా మారతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు, కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, జక్కిలి ఐలయ్య యాదవ్, గడ్డి పద్మావతి, అజ్మీరా రాజునాయక్, జీవీజీ నాయుడు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి : Chintamaneni: వైసీపీకి చుక్కలు చూపిస్తాం