- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇది కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనం.. మాజీమంత్రి హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: ఈ ఘటన కాంగ్రెస్(Congress) అసమర్ధతకు నిదర్శనమని, దీనిపై ఎన్డీఎస్ఏ (NDSA) విచారణ (Enquiry) చేపట్టాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) డిమాండ్ (Demand) చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) ఆమ్రాబాద్ మండలం (Amrabad Mandalam)లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ (Srishailam left canal) సొరంగం (Tunnel) కుప్పకూలింది. మట్టి కూలడంతో సొరంగంలో పనికి వెళ్లిన సుమారు 14 మంది మట్టిలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై పలు విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. అలాగే చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని దుయ్యబట్టారు. అంతేగాక మొన్న సుంకిశాల (Sunkishala)లో రీటైనింగ్ వాల్ (Retaining Wall) కూలిన ఘటన, నేడు ఎస్ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నదనీ గుర్తించినప్పటికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.
ఇక ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తుందని చెప్పారు. వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. అంతేగాక డీ వాటరింగ్ (De Watering) చేసి, వెంటనే విద్యుత్ పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలని సూచించారు. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (National Dam Safity Authority) (NDSA) వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) రాసుకొచ్చారు.