గద్దర్‌కు మంచి పేరు, నంది అవార్డు అందించిన పాటలు ఇవే

by Mahesh |   ( Updated:2023-08-06 10:36:16.0  )
గద్దర్‌కు మంచి పేరు, నంది అవార్డు అందించిన పాటలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో యావత్ తెలంగాణ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కాగా గద్దత్ ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. అందులో గద్దర్ రాసి పాడిన "అమ్మ తెలంగాణమా" అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగుతుంది ఈ పాట. కాగా ఈ పాట లేకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేదు అనడంలో అతిశయోక్తి లేదు.

అలాగే "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. కానీ గద్దర్ ఆ అవార్డును తిరస్కరించారు. మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దు' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట కూడా అద్భుత విజయం సాధించింది. అలాగే "అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా" అనే పాటను "తెలంగాణా" రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది.

Read More..

బిగ్ బ్రేకింగ్: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రస్థానం ఇదే.. ఒంట్లో తూటాతోనే..

Advertisement

Next Story

Most Viewed