- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Khairatabad Ganesh:భక్తులకు అలర్ట్..ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..కారణం ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో గణపయ్య నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి(Mahaganapati) దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి(Khairatabad Ganesh) దర్శనం ఉంటుందని నిర్వాహకులు(Managers) ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం నిమజ్జనం(Immersion) చేస్తామని తెలిపారు. వీకెండ్ కావడం, ఆదివారం వరకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఖైరతాబాద్(Khairatabad), లక్డీకపూల్(Lakdikapool) మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.