Sabitha Indra Reddy:‘రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు’ ..సర్కార్ పై మాజీ మంత్రి ఫైర్!

by Jakkula Mamatha |
Sabitha Indra Reddy:‘రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు’ ..సర్కార్ పై మాజీ మంత్రి ఫైర్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్త్రీలకు భద్రత కరవైందని, వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చించి 48 గంటలైనా గడవక ముందే 4 అత్యాచారాలు జరిగాయన్నారు. ఈ ఘటనలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

పార్టీ పేరుతో మద్యం మత్తులో యువతి పై స్నేహితుడు, మరో వ్యక్తి కలిసి అత్యాచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై అత్యాచారం ఘటనపై ఆమె ఆగ్రహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆపాలని ఆమె సూచించారు.

Advertisement

Next Story