- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో తప్పిన ‘ఉప’ ఎన్నిక.. ఎవరూ ఊహించని తీర్పిచ్చిన మూడు నియోజకవర్గాల ఓటర్లు..!
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా నరాలు తెగే ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 64 సీట్లు సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 61 స్థానాలను దాటి స్పష్టమైన మెజార్టీ సాధించి విజయం ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచిన గులాబీ పార్టీ.. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూసినప్పటికీ ప్రజలు మాత్రం తిరస్కరించారు. ఇదిలా ఉంటే, ఈ సారి రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు రెండు చోట్ల బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ హుజురాబాద్‌తో పాటు గజ్వేల్ నుండి బరిలోకి దిగారు.
ఎన్నికల్లో ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉంటుంది.. కానీ రెండు చోట్ల గెలిస్తే ఎక్కడ ఒక చోట మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీంతో ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ రెండు చోట్ల గెలిచిన ఉపఎన్నిక అనివార్యం అయ్యి ఉండేది. రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నిక జరిగే ఉండేది. కానీ ఓటర్లు షాకింగ్ తీర్పు ఇచ్చారు. రెండు చోట్ల పోటీ చేసిన ముగ్గురిలో ఒక్కరిని కూడా రెండవ స్థానంలో గెలిపించలేదు. కేసీఆర్ గజ్వేల్‌లో గెలిచి.. కామారెడ్డిలో ఓటమి చవిచూడగా.. రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్‌లో విజయం సాధించి.. కామారెడ్డిలో ఓడిపోయారు.
ఇక, తన సొంత ఇలాకా హుజురాబాద్‌తో పాటు కేసీఆర్‌పై గజ్వేల్‌లో బరిలోకి దిగిన ఈటలకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల రాజేందర్‌ను ఓడించారు. ఉన్న స్థానంపై సరిగ్గా ఫోకస్ చేయకుండా రెండవ స్థానంలో బరిలోకి దిగితే.. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది ఈటల పరిస్థితి. ఇలా రెండు చోట్ల పోటీ చేసిన ముగ్గురు అగ్రనేతల్లో కేసీఆర్, రేవంత్ ఒక చోట గెలిచి మరో చోట ఓడగా.. ఈటల రాజేందర్ మాత్రం బరిలోకి దిగిన రెండు స్థానాల్లో ఓటమి చవిచూశారు. దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నిక తప్పింది. ఈ మూడు నియోజకవర్గాల ఓటర్ల తీర్పు ప్రస్తుతం రాష్ట్ర హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. కామారెడ్డి సెగ్మెంట్ ఈ సారి రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్‌తో పాటు రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి బరిలోకి దిగడంతో.. కామారెడ్డి పేరు రాష్ట్రంలో మారుమోగింది. ఇక్కడ ఎవరూ గెలుస్తారని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇక్కడ కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి విజయం సాధిస్తాడని అందరూ ఊహించారు. కానీ కామారెడ్డి ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను మట్టికరిపించి బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు.