- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ మృతుల్లో తెలంగాణ స్థానికులు లేరు.. క్లారిటీ ఇచ్చిన రెసిడెంట్ కమిషనర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో డ్రైనేజీ పొంగిపొర్లిన ఘటనలో మృతి చెందిన ముగ్గురిలో తెలంగాణ యువతి ఒకరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె తెలంగాణ స్థానికురాలు కాదని, బిహార్ రాష్ట్రానికి చెందిన వారీగా ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. మృతురాలు తానియాసోనీ బిహార్ రాష్ట్రం నుంచి వచ్చి ఢిల్లీలోని సివిల్ కోర్సులకు శిక్షణ తీసుకుంటున్నట్లు తేలింది. మృతురాలి తండ్రి కోల్ ఇండియా సంస్థలో గెజిటెడ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన డిప్యూటేషన్ మీద మంచిర్యాలలోని సింగరేణి కంపెనీలో పని చేస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి చేరుకున్న ఆయన మృతదేహాన్ని బిహార్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
తెలంగాణ యువత మృతి చెందిన వార్త తెలుసుకున్న వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఇదే విషయమై ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. యువతితో పాటు ఇంకెవరైనా బాధితులు తెలంగాణకు చెందిన వారు ఉన్నారేమోనని ఆరా తీశారు. చనిపోయిన వారిలో గానీ, భవనం నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన మిగిలిన 30 మందిలో ఎవరూ తెలంగాణకు చెందిన వారు లేరని సీఎంకు గౌరవ్ ఉప్పల్ క్లారిటీ ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి ఆర్థికంగా లేదా మరే రూపంలోనైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరుకుంటే అందజేయాల్సిందిగా గౌరవ్ ఉప్పల్‌కు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. తానియా సోని మృతదేహాన్ని బీహార్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం అవసరమైతే అందజేయాలని స్పష్టం చేశారు. కానీ, బాధితురాలి కుటుంబ సభ్యులు సొంతంగానే ఏర్పాట్లు చేసుకున్నారని రెసిడెంట్ కమిషనర్ వివరించారు. మృతురాలి కుటుంబం కోరితే అవసరమైన సాయాన్ని అందిస్తామని సీఎంకు గౌరవ్ ఉప్పల్ క్లారిటీ ఇచ్చారు.