- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీలోకి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు.. ముహుర్తం ఫిక్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలోకి మరో కీలక నేత చేరికకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇటీవలే టీజేఎస్‌కు రాజీనామా చేసి కోదండరామ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆ పార్టీ నేత గంగాపురం వెంకట్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు వెంకట్ రెడ్డి గురువారం ప్రకటించారు. వెంకట్ రెడ్డి టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అంతకు మందు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ పరిణామం ఆసక్తిగా మారింది.
కమలం వైపు ఉద్యమకారుల చూపు
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ నేతలు ఉద్యమకారులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న నేతలను పార్టీలో చేరే విధంగా చర్యలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను చిన్నచూపు చూస్తోందని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ విమర్శలు చేస్తోంది.
ఈ క్రమంలో గతంలో కేసీఆర్ వెంట నడిచిన వారితో పాటు ఉద్యమకారులను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్, విజయశాంతి, రఘునందన్ రావు, జిట్టా బాలకృష్ణా, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు రాణిరుద్రమ వంటి ఉద్యమకారులను బీజేపీలో చేరేలా ఆ పార్టీ సక్సెస్ అయింది. తాజాగా వెంకట్ రెడ్డి సైతం బీజేపీ గూటినే ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.