Union Minister: బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పదం.. స్పందించిన కేంద్ర మంత్రి

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-27 10:04:02.0  )
Union Minister: బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పదం.. స్పందించిన కేంద్ర మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌ 2024-2025లో తెలంగాణ పదం కనిపించకపోవడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని.. అన్నింటికీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల ప్రస్తావన రాకపోవచ్చు కానీ, కేటాయింపులు అన్ని రాష్ట్రాలకు జరిగాయని తెలిపారు. చరిత్రలో ఇలా అనేకసార్లు జరిగిందని చెప్పారు. బడ్జెట్‌లో తెలంగాణకు కూడా ఎక్కువ నిధులే కేటాయించామని వెల్లడించారు. యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ కేటాయింపులు ఉండేవని గుర్తుచేశారు.

కానీ ఈ పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు తాము అధిక నిధులే కేటాయించామని అన్నారు. అయినా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. దీని వల్ల రాష్ట్రానికి ఏం ప్రజయోగం ఉండదని తెలిపారు. పైగా తెలంగాణ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఒక మంచి అవకాశం కోల్పోతారని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed