టీచర్ల బదిలీ, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల

by srinivas |
టీచర్ల బదిలీ, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మినహా ఇతర జిల్లాలకు చెందిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పూర్తయింది. కాగా శుక్రవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూలను విద్యాశాఖ ప్రకటించింది. కేవలం ఎనిమిది రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని చూస్తున్నారు. వచ్చేనెల 5వ తేదీ వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయనుంది. ఈనెల 28వ తేదీన జెడ్పీ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ల వేకెన్సీ జాబితాను డిస్ ప్లే చేయనున్నారు. 29న సీనియారిటీ జాబితాకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించనున్నారు. 30వ తేదీన ఫైనల్ సీనియారిటీ జాబితాను ప్రదర్శించడంతో పాటు వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన బదిలీ అవ్వబోయే, బదిలీ అనంతరం ఏర్పడిన ఖాళీలను డిస్ ప్లే చేయనున్నారు. వచ్చేనెల 2న వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 3న ఎస్జీటీ, దానికి సమానమైన కేడర్ కు సంబంధించిన వేకెన్సీ జాబితాను ప్రదర్శించనున్నారు. వచ్చేనెల 4న ఫైనల్ సీనియారిటీ జాబితాను రిలీజ్ చేయనున్నారు. జూలై 5న ట్రాన్స్ ఫర్ ఆర్డర్లను రిలీజ్ చేయనున్నారు.



Next Story