సిగ్నల్స్ లోపం వల్లే ప్రమాదం.. ప్రాథమిక రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు

by samatah |   ( Updated:2023-06-03 14:47:18.0  )
సిగ్నల్స్ లోపం వల్లే ప్రమాదం.. ప్రాథమిక రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. గార్డ్‌ బ్రేక్‌ వ్యాన్‌, హాల్‌ కోచ్‌లు మెయిన్‌ లైన్‌పై ఉన్నాయి. మెయిన్ లైన్ పై వెళ్లేందుకు కోరమండల్ కు మొదట సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని ఆపేశారు. దీంతో కోరమాండల్‌ లూప్ లైన్ లో వెళ్లిందని నివేదిక స్పష్టం చేసింది. లూప్ లైన్ లో వేగంగా వెళ్లిన కోరమండల్ ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. రైలు ప్రమాదం నిన్న సాయంత్రం 5:55 గంటలకు సంభవించిందని సాయంత్రం 6:50 కి హౌరా ఎక్స్ ప్రెస్ రైలు బహనాగా స్టేషన్ దాటగా.. కోరమండల్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం. 6:50కు ఖాంతాపార స్టేషన్ దాటిందని నివేదిక పేర్కొంది. గూడ్స్ ట్రైన్ ను కోరమండల్ ఢీ కొట్టడంతో దాని బోగీని మరో ట్రాక్ పై పడ్డాయని దాంతో ఆ ట్రాక్ పై వస్తున్న హౌరా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది. మరో వైపు ప్రమాదం ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో178 మంది ఏపీ వాసులు

అంతా అనుమానస్పదమే.. కోరమండల్ ప్రమాదంపై రైల్వే మాజీ అధికారి సంచలన కామెంట్స్ (వీడియో)

Advertisement

Next Story