తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక సూచన చేశారు.

by M.Rajitha |
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక సూచన చేశారు.
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక సూచన చేశారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.సుదర్శన్ రెడ్డి కోరారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ జూలై 20న నుండి జరుగుతోందని.. అక్టోబరు చివరి వరకు ముసాయిదా జాబితా ప్రకటించి, నవంబరులో అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 6న తుది జాబితా వెల్లడిస్తామని అన్నారు. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 8 లక్షల కొత్త అప్లికేషన్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఓటరు కార్డు , ఆధార్ లింక్ దాదాపు 60% పూర్తయ్యిందని తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో3,33,27,304 మంది ఓటర్లు ఉన్నట్టు కమిషనర్ తెలియ జేశారు.

Next Story

Most Viewed