ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

by Javid Pasha |
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జూనియర్ కళాశాల్లో ఖాళీగా వున్నా వివిధ సబ్జెక్టులను బోధించడానికి ఫ్యాకల్టీని నియమించుకొనేందుకు గాను 1652 గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది .ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నియామకులకు సంబంధించి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలన్న అంశంపై జిల్లా ఇంటర్ విద్య అధికారులకు మార్గదర్శకాలను సూచించింది. ఈ నియామకాలకు ఆయా జిల్లా పరిధిలో సెలక్షన్ కమిటీలను నియమించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా , జాయింట్ కలెక్టర్, కాలేజీ ప్రిన్సిపల్ మెంబర్లుగా కమిటీ ఉంటుంది . ఈ ముగ్గురు పర్యవేక్షణలో గెస్ట్ ఫ్యాకల్టీని ఎంపిక చేస్తారు.

వివిధ జిల్లాలో ఖాళీల ను ఆయా జిల్లా డి ఐ ఈ ఓ అధికారి బుధవారం ( నేడు ) పత్రిక ప్రకటన ద్వారా ప్రకటిస్తారు . ఈ నెల 24 తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి . 26 న సర్టిఫికట్ ల పరిశీలన ,స్క్రూటినీ చేస్తారు . 27 న సబ్జెక్టు ,జిల్లా వారీగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేయడం ఆ లిస్ట్ ను సెలక్షన్ కమిటీ సమర్పిస్తారు . 28 న జిల్లా వారీగా గెస్ట్ ఫ్యాకల్టీని జిల్లా కలెక్టర్ అలాట్ చేస్తారు . ఎంపికైన ఫాకల్టీ సంబంధిత కలశాల్లో ఆగస్టు ఒకటవ తేదీలోగా రిపోర్ట్ చేయాలి లేనిపక్షంలో వారి ఎంపికను రద్దు చేస్తారు .

జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కావాల్సిన సబ్జెక్టులకు ఫ్యాకల్టీని ఎంతమంది అవసరమో ఎన్ని గెస్ట్ ఫ్యాకల్టీలు రిక్రూట్మెంట్ చేసుకోవాలో నిర్ణయిస్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి జిల్లా ఇంటర్ విద్య అధికారులు ప్రకటన త్వరలో జారీ చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా ఇంటర్ విద్య అధికారుల కార్యాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో పీజీ మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో జిల్లా ఇంటర్ విద్య అధికారి ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీకి మెరిట్ లిస్టును పంపిస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ గెస్ట్ ఫ్యాకల్టీనీ ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ ప్రూఫ్స్ సర్టిఫికెట్స్‌తో పాటు మూడు సెట్ల ఫోటో కాపీలతో రావాల్సి ఉంటుంది. గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందికి ఈ అకాడమీక్‌ ఇయర్ ముగిసే వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. వీరికి రెగ్యులరైజ్ గాని రెన్యువల్ కానీ చేయాలని కోరే అవకాశం ఉండదు . ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్ ఏవి కుడా గెస్ట్ ఫ్యాకల్టీకి వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొంది . గెస్ట్ ఫ్యాకల్టీలందరికీ బయో మెట్రిక్ విధానంలో హాజరు వేయాలి . గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధిత ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ నుండి ధృవీకరించబడిన పని తీరు ఆధారంగా రెమ్యూనరేషన్ ఇస్తారు .

.

Advertisement

Next Story