- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారెవ్వా ఏం పోలీసులు.. నేరస్థునికి స్టేషన్ లోనే పుట్టిన రోజు వేడుకలు
దిశ డైనమిక్ బ్యూరో: సాధారణంగా నేరస్థులపట్ల పోలీసుల తీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ నేరస్థుల పట్ల పోలీసులు అభిమానం చూపడం సినిమాల్లో చూస్తుంటాం. అయితే ప్రతి సినిమా ఓ జీవితమే అన్నట్లు నేరస్థులకు పోలీసులు గులాం అయ్యే సన్నివేశాలు ఈ ఎస్సై ని చూసే పెట్టి ఉంటారా అనే ఆలోచన రాక మానదు భోపాలపల్లి లోని మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వేణుమాధవ్ గౌడ్ గురించి తెలిసినవాళ్లకు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో మాధవ్ గౌడ్ అనే వ్యక్తి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన మహేందర్ గౌడ్ అనే వ్యక్తి జిల్లా పరిధిలోని అనేక పోలీసు స్టేషన్లలో హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేందర్ గౌడ్ పేరు మీద రౌడీషీట్ ఓపెన్ చేశారు.
అలానే పోలీసు స్టేషన్లలోని నోటీసు బోర్డుల్లో కూడా మహేందర్ ఫొటోను ఉంచారు. ఇలాంటి క్రిమినల్ నేపథ్యం కలిగిన ఉన్న వ్యక్తికి ఎస్సై మాధవ్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మన కులపోడే రా బై.. అన్న పుట్టిన రోజు ధూంధాంగా చెయ్యాలే అనుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాటు చేశారు.
ఇక కేక్ తీసుకు వచ్చి స్టేషన్ లోనే రౌడీ షీటర్ మహేందర్ గౌడ్ తో కేక్ కట్ చేయించారు. ఎవరో మహాత్ముని పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు భావించి ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఎస్సై పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కాకి డ్రెస్ వేసుకుని కులానికి కొమ్ముకాస్తూ.. నేరస్తుల పుట్టిన రోజులు చెయ్యడానికి సిగ్గులేదా అంటూ కామెంట్ల రూపంలో మండిపడుతున్నారు. ఇక ఈ విషయం పై స్పందించిన భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్ రావు ఎస్సై మాధవ్‌కు మెమో కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.