- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగిసిన టెక్నికల్ ఎస్సై, ఏఎస్ఐ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించిన ఎస్‌సీటీ ఎస్ఐ, ఎస్‌సీటీ ఏఎస్ఐ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెక్నికల్ పోస్టులైన ఎస్‌సీటీ ఎస్ఐ(ఐటీ అండ్ సీవో), ఎస్‌సీటీ ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ శనివారం రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు ఉదయం, మధ్యాహ్నం రాతపరీక్షలు నిర్వహించగా, మొత్తం 77.93 శాతం మంది హాజరయ్యారైనట్లు టీఎస్ఎల్పీఆర్బీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎస్‌సీటీ ఎస్ఐ(ఐటీ అండ్ సీవో) పోస్టులకు 4099 మంది దరఖాస్తు చేసుకున్నారని, 3233 మంది(78.87 శాతం) హాజరయ్యారైనట్లు అధికారులు తెలిపారు. ఎస్‌సీటీ ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు 2008 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, 1526(76 శాతం) మంది హాజరైనట్లు తెలిపారు. త్వరలోనే కీని అధికార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.