- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న ఇసుక గ్యాంగ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. టీఎస్ఎండీసీ మంజీరా నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా, అందుకు విరుద్ధంగా అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట అన్న చందంగా పరిస్థితి ఉంది. మంజీరా పరివాహక ప్రాంతమైన బిచ్కుంద, బీర్కూర్‌లో టీఎస్ఎండీసీ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని కాదని తమకు నచ్చిన చోట తవ్వకాలు చేస్తున్నారు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో టీఎస్ఎండీసీ ప్రైవేట్ వ్యవసాయ పట్టా భూమిగా ఉన్న సర్వే నంబర్ 156లో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చింది.
కానీ అందుకు విరుద్ధంగా ఏకంగా మంజీరా నదిలో తవ్వకాలు చేపట్టారు. ఇందులో విశేషం ఏంటంటే వ్వయసాయ విస్తరణ అధికారి మాత్రం అక్కడ వ్యవసాయం సాగుతుందని చెబుతున్నారు. ఆ సర్వే నంబర్‌లో ప్రస్తుతం సీజన్‌లో బీపీటీ రకం వరి వంగడాన్ని సాగు అవ్వడం గమనార్హం. ఏడు ఎకరాల్లో 156 సర్వే నంబర్లు ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకున్న వ్యాపారులు అది కాదనీ ఇసుక తవ్వకాలు చేయడం విశేషం. మంజీరాలో పెద్ద పెద్ద మిషన్లతో వందల కొద్ది టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. - దిశ ప్రతినిధి, నిజామాబాద్
కామారెడ్డి జిల్లాలోని టీఎస్ఎండీసీ అనుమతించిన ఇసుక ఏకంగా రాజధానితో పాటు మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా మంజీరాలో తవ్వకాలు చేస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. గత నెల చివరి వారంలో జిల్లాలో వడగళ్ల వానతో పాటు కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు మంజీరానది ప్రవహించడంతో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు.
మళ్లీ తాజాగా ఈ నెల 2న ఇసుక తవ్వకాలను ప్రారంభించారు. ఇసుక తవ్వకాలకు పట్టాభూమి పేరిట అనుమతులు తీసుకుని నదిలో తవ్వకాలు చేస్తుంటే టీఎస్ఎండీసీ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదు. గత పదిరోజులుగా ఇసుక తవ్వకాలు నిలిచిపోతే గానీ సంబంధిత నది పరివాహక ప్రాంతంలో జరుగాల్సిన తవ్వకాలు నదిలో జరుగుతున్న విషయం బహిర్గతం కాలేదు. ఏడు ఎకరాల పట్టా భూమిలో అనుమతులు తీసుకున్న ఇసుక వ్యాపారులు అందులో పంటలు సాగు అవుతుంటే దాని పేరు మీదనే నదిలో తవ్వకాలు చేస్తున్నారు.
అధికార పార్టీ నాయకుల అండ ఉండడంతో వారి తవ్వకాలకు అడ్డుఅదుపు లేకుండాపోయింది. పర్సంటేజిల మాయలో పడి అక్కడ జరుగుతున్న తవ్వకాలను ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. బిచ్కుంద, హైదరాబాద్ రోడ్డు, మహారాష్ట్ర వైపు వందలకొద్ది టిప్పర్లు రోడ్డుపైనే బారులు తీరి ప్రమాదాలకు నిలయంగా మారినా గతేడాది టిప్పర్ల కారణంగా జరిగిన ప్రమాదాలతో ఇద్దరు అసువులు బాసిన పట్టించుకునే వారే లేరు. బిచ్కుంద, బీర్కూర్ ప్రాంతంలో మంజీరా నదిపై చెక్ డ్యాంల నిర్మాణాలకు అనుమతి తీసుకున్నా ఇక్కడి పాలకులు దాని పేరుతో ఇసుకను తవ్వి నది గర్భంలో పెద్ద పెద్ద గొయ్యిలు తీస్తున్నా ఒక్క అధికారి కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు.
ఇసుక తవ్వకాలకు క్యూబీక్ మీటర్ల సామర్థ్యంతో అనుమతి తీసుకుని నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు చేస్తున్నా అడిగే వారు లేరు. అకాల వర్షం కురిసి వారం రోజుల తర్వాత మళ్లీ నది ప్రవాహం నిలిచిపోవడంతో తవ్వకాలు క్వారీలను తలపిస్తున్నాయి. ఒక్కొక్క టిప్పర్ మునిగిపోయే స్థాయిలో ఇసుకను తవ్వుతున్నా పట్టించుకునే వారు లేరు. ఇటీవల వర్షానికి నదిలో ర్యాంపులు కొట్టుకపోగా మళ్లీ మరమ్మతులు చేసి ఇసుక తవ్వకాలు షురూ చేసినా అటువైపు చూసే వారు కరువయ్యారు.
రూ.కోట్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమన్న వాదనలు ఉన్నాయి. ఏకంగా ప్రజాప్రతినిధులే ఇసుక వ్యాపారుల వెనుక ఉండడంతో వారు ఇష్టమొచ్చినట్లు మంజీరాలో తవ్వకాలు చేస్తూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. టీఎస్ఎండీసీ తనిఖీ కేంద్రం ఉన్నా అది ఉత్తుత్తిగానే ఉంది. కనీసం ఇసుక టిప్పర్లలో వే బిల్లులను తనిఖీ చేసే వారే లేరు. పట్టపగలు జరిగితే అందరికీ తెలుస్తుందని రాత్రివేళల్లో వాహనాల వెలుతురులలో నది గర్భాన్ని కుళ్లబొడుస్తున్నా పట్టించుకునే వారు లేరని చెప్పాలి.
ఇసుక తవ్వకాలు పరివాహక ప్రాంతంలోనే అనుమతి ఉంది : ఆర్ఐ సాయిబాబా
హస్గుల్ గ్రామంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై బిచ్కుంద మండలం ఆర్ఐ సాయిబాబా దిశతో మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు 156 సర్వే నంబర్ లో అనుమతి ఇచ్చింది వాస్తవమేనని తెలిపారు. తవ్వకాలపై టీఎస్ఎండీసీ అధికారులకే తెలుసునని తెలిపారు.