భద్రాచలం దగ్గర మరింత పెరిగిన గోదావరి ఉధృతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 15:04:21.0  )
భద్రాచలం దగ్గర మరింత పెరిగిన గోదావరి ఉధృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం(Bhadrachalam) దగ్గర గోదావరి(Godavari) ఉధృతి మరింత పెరిగింది. ప్రస్తుతం 44 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.61లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ఏపీలోని ఆరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి(Godavari) నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నది. కాగా, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తు తం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో వరద పెరిగే అవకాశం కనిపిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed